5 వేల మందితో మెగా సెల్ఫీ క్యాంప్ విజయవంతం..
1 min read– ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియుతెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పడం అభినందనీయం..
మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరపాలక సంస్థ ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోవడం గర్వించదగ్గ మరియు అభినందించదగ్గ విషయమనిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కొనియడారు. ఆమె చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.మహాత్మాగాంధీ జయంతి ని పురస్కరించుకొని స్వచ్ఛతే సేవ గా అవగాహన కల్పించే మెగా క్యాంప్ ను అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని సోమవారం అల్లూరి సీతారామ రాజు స్టేడియం లో నిర్వహించారు. డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, కో-ఆప్షన్ సభ్యులు నీతా కుమార్ జైన్ విచ్చేసి పలువురుని అభినందించారు. మహిళలు,యువత,విద్యార్థులు, ఉద్యోగులు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఒక గంట పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు 4500 మందితో ఉన్న సెల్ఫి రికార్డును ఏలూరు నగరపాలక సంస్థ స్వచ్చత అనే మంచి సత్సంకల్పం తో దాటి వెళ్లిందన్నారు.ఈ మూడు రికార్డ్స్ సొంతం చేసుకోవడం ద్వారా త్యాగమూర్తి మహాత్మా గాంధీజీకి ఏలూరు నగర ప్రజలు ఇచ్చే ఘన నివాళిగా నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ , డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎన్ రాధ అభివర్ణించారు. మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ అధికారులు,సిబ్బంది చేసిన కృషిని మేయర్ నూర్జహాన్ పెదబాబు అభినందించారు. ఈ కార్యక్రమానికి హెల్త్ ఆఫీసర్ మాలతి మరియు కార్పొరేటర్లు , నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు.