NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌ది ల‌క్ష‌ల విరాళం ఇచ్చిన మెగాబ్ర‌దర్ నాగ‌బాబు.. ఎందుకంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కల్తీ సారా మరణాలను కూడా సహజ మరణాలంటూ శాసనసభలో జగన్ అబద్ధం చెపారని జ‌న‌సేన నేత నాగ‌బాబు ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో తాము పరిశీలించాక వాస్తవ పరిస్థితి అర్ధమైందన్నారు. కౌలు రైతులు బాధ పడుతున్నా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. తమ అధినేత ముందుకు వచ్చి సొంతంగా సాయం చేయడం అభినందనీయన్నారు. వైసీపీ నాయ‌కులు షార్ట్ ట‌ర్మ్ మెమోరీతో బాధ‌ప‌డుతున్నార‌ని అన్నారు. “భవిష్యత్తు తరాలు మాత్రం పవన్ కళ్యాణ్ వంటి గొప్ప నేత దగ్గర పని చేశామని గర్వ పడతాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపు కోసం కోట్లు ఖర్చు పెడతారు. ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ఎందుకు ఖర్చు పెట్టరు. నా వంతు బాధ్యతగా పార్టీకి పది లక్షల విరాళం అందజేస్తున్నా.’’ అని నాగబాబు తెలిపారు

                                      

About Author