పుట్టిన రోజుకు దూరంగా మెగాస్టార్ చిరంజీవి !
1 min readపల్లెవెలుగువెబ్ : సోమవారం చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. అభిమానులు సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు. హైదరాబాద్లో ‘మెగా కార్నివాల్’ పేరుతో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే చిరు మాత్రం పుట్టిన రోజున హైదరాబాద్లో లేరు. ఆయన కుటుంబంతో కలిసి బెంగళూరు వెళ్లారు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్ తిరిగొస్తారు. ‘‘చమటను ధారగా బోసి కష్టపడి.. సంపాదించిన దాంట్లో ఎందరికో సాయం చేసిన మా అన్నయ్య..’’ అంటూ పవన్ కల్యాణ్ చిరుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా తనకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని, ఆయన జీవితం తెరచిన పుస్తకమని కొనియాడారు పవన్.