NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆమరణ దీక్షకు హాజరైన రాష్ట్ర కౌన్సిల్ మెంబర్…

1 min read

ఆవరణ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ…

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : 37వ రోజు కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షకు ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్  చంద్రకళ బుధవారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద కు చేరుకొని  రాష్ట్ర కమిటీకి మద్దతుగా  నంద్యాల జిల్లా ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర నాయకురాలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో జరుగుతున్న నిరవధిక సమ్మెకు  హాజరైన అంగన్వాడీలకు ధైర్యం నింపుతూ ప్రధానమైన వేతనాల పెంపు కోసం బుధవారం నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న  నేతలందరికీ  మనమంతా ఎంతో రుణపడి క్రింది స్థాయిలో సమ్మెను సుదీర్ఘంగా కొనసాగించాలని, ధైర్యంతో ముందుకెళ్లాలని దీక్షలో పాల్గొన్న వారికి ధైర్యం నింపారు. ఎస్మా చట్టానికి సంబంధించి న్యాయవాదుల ద్వారాసంప్రదింపులు చేశారన్నారు. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని ఆమె సూచనలు ఇచ్చారు.

About Author