NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాండ్ర శివానందరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన గిత్త వర్గీయులు

1 min read

గజమాలతో టీడీపీ నేతలకు ఘాన సన్మానం.

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు :  నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గిత్తా జయసూర్యను నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి ని శనివారం ప్రకటించారు. గిత్తా జయసూర్యను ప్రకటించడంతో నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన గిత్త జయసూర్య వర్గీయులు ఆదివారం నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి ని గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మాదిగలను తెలుగుదేశం, వైకాపా పార్టీలు పూర్తిగా విస్మరించారని అయితే మాండ్ర శివానందరెడ్డి రానున్న 2024 ఎన్నికల్లో మాదిగలకు టిక్కెట్ కేటాయిస్తామని గతంలోనే హామీ ఇచ్చారని ఆ హామీని నేడు మాండ్ర శివానంద రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు . అందులో భాగంగా మాండ్రకు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల మాదిగలు రుణపడి ఉంటారని నేటి నుండి అన్ని పార్టీల్లో ఉన్న మాదిగలు తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు జమీల్, సురేంద్రనాధ్ రెడ్డి, పగిడ్యాల జయరాజ్, పగడం శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

About Author