NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సభ్యత్వ నమోదు క్యాంపెయిన్

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద: హొళగుంద మండలం సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ లో భాగంగా APTF జిల్లా ప్రధాన కార్యదర్శి బి నాగరాజు, జిల్లా కార్యదర్శి సుబ్బారెడ్డి  జిల్లా ఉపాధ్యక్షులు Y. తిక్క స్వామి గారు, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ముత్తన్న , మరి ఏపీ టీ ఎఫ్ నాయకులు శ్రీనివాసులు గోపీనాయక్, మధు,సంజీవుడు మొదలైన కార్యకర్తలు పాల్గొన్నారు. మండలం లోని  ఉపాధ్యాయులు ఏపీటీఎఫ్ సభ్యత్వం నమోదు దాదాపుగా 100 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా చేరారు.జిల్లా ప్రధాన కార్యదర్శి  మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న మూడు డీఏలను  వెంటనే ప్రకటించాలని, దసరాకు ఇస్తానన్న ఒక DA ను వెంటనే ప్రకటించాలని, ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని, జూలై 2023 నుంచి IR ప్రకటించాలని, అలాగే హొళగుంద హైస్కూల్లో కన్నడ మీడియం ని కూడా కొనసాగించాలని, డీఈవో పూల్ లో ఉన్న తెలుగు, హిందీ పండిట్లను వారిని రెగ్యులర్ ప్లేస్ లో  ట్రాన్స్ఫర్ చేయాలనిడిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే మున్ముందు APTF ఉద్యమాల ద్వారా సాధిస్తుందని తెలియజేశారు.

About Author