NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీడలతో మానసిక ఉల్లాసం… మాజీ సర్పంచ్

1 min read

– వాలీబాల్ ప్లేయర్స్ కు ఉచితంగా క్రీడా దుస్తులు అందజేసిన బిసి రాజారెడ్డి

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో.క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుందని బనగానపల్లి పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి అన్నారు. బనగానపల్లె పట్టణానికి చెందిన వాలీబాల్ ప్లేయర్స్ కు రూ. 10 వేలు విలువ చేసే క్రీడా దుస్తులను ఉచితంగా బిసి రాజారెడ్డి అందజేశారు. స్థానిక కార్యాలయంలో బిసి రాజారెడ్డి మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ స్నేహభావంతో ఉండాలన్నారు. ఓటమి చెందితే కుంగిపోకుండా రెట్టింపు ఉత్సాహంతో మరోసారి పోటీల్లో పాల్గొని విజయం సాధించాలన్నారు.  ఓటమి అనేది గెలుపునకు  నాంది అన్నారు. యువత జీవితాల్లో క్రీడలు ఒక భాగం కావాలని వారు క్రీడల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలకు సంబంధించిన క్రీడాకారులు ఒలంపిక్స్ లో ఎన్నో బంగారు పతకాలు  సాధిస్తున్నారని , అయితే భారతదేశం క్రీడల్లో చాలా వెనుకబడి ఉందన్నారు.ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లేకే క్రీడాకారులు ఆయా క్రీడల్లో రాణించలేకవెనుకబడిపో తున్నారన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించి వారికి తగిన గుర్తింపునుఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు క్రీడలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రతిరోజు యోగ, వ్యాయామం అలవాటు చేసుకోవడం ఎంతైనా అవసరమని బిసి రాజారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో నుసి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

About Author