PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాయామ విద్యతోనే మానసిక పరివర్తన సాధ్యం…

1 min read

– వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కోఆర్డినేటర్ చందు నాయక్ స్పష్టం                                   

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వ్యాయామ విద్యను అభ్యసించడంతోనే మనిషి మానసిక పరివర్తన, పరిపక్వత సాధ్యపడుతుందని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం పత్తికొండ నియోజకవర్గం కోఆర్డినేటర్ చందు నాయక్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఇండోర్ స్టేడియంలో వ్యాయామ విద్యపై కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యాయామ విద్య కాంప్లెక్స్ నిర్వహణలో భాగంగా మొదటిసారిగా ఏర్పాటు చేసిన వ్యాయామ విద్య అభ్యసనం కాంప్లెక్స్ సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని  వ్యాయామ విద్య అభ్యసనం పట్ల ఆసక్తి గొలిపే విధంగా చర్చలు జరిగాయి. పత్తికొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వ్యాయామ విద్య బోధన చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. స్థానిక ఎంఈఓ లు మస్తాన్వలి, రమేష్, ప్రధానోపాధ్యాయురాలు మాలతి వ్యాయామ విద్య అభ్యసన కాంప్లెక్స్ సమావేశానికి హాజరై వ్యాయామ విద్యా అభ్యసనంపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాయామ విద్య కాంప్లెక్స్ విధానాన్ని తీసుకువచ్చిందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో వ్యాయామం విద్యాభివృద్ధికి అందరూ తోడ్పడాలని వారు కోరారు. వ్యాయామ విద్యా అభ్యసనంపై ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన బాధితులపై చర్చించారు. వ్యాయామ ఉపాధ్యాయులు యోగా శిక్షణ, క్రీడల నిర్వహణ, అభివృద్ధి పరిచే విధంగా మెలకువలను తెలుసుకోవాలని వారు వివరించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి వ్యాయామ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా వ్యాయామ ఉపాధ్యాయులకు నియోజకవర్గస్థాయిలో వ్యాయామ విద్యపై కాంప్లెక్స్ మీటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా పత్తికొండ నియోజకవర్గం పత్తికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు ఈరోజు జరిగింది ఈ సమావేశానికి గాను పత్తికొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ చందు నాయక్ ఆధ్వర్యంలో మస్తాన్వలి సార్ మరియు రమేష్ సార్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాలతి మేడం పర్యవేక్షణలో పత్తికొండ నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యాయామ విద్యను పాఠశాలలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి వ్యాయామ ఉపాధ్యాయుని విధులు వారి యొక్క బాధ్యతల గురించి చర్చించి నిర్ణయాలు చేయడం జరిగిందని తెలిపారు.

About Author