మెప్మా అధికారి ఏకపక్షం..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూల్ నగరంలోని లిటిల్ రోజెస్ పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు టి కుళ్లాయమ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిఎల్ఎఫ్ ఓబి లను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారానే ఓబిలని ఎన్నిక జరుగుతుందని అందుకు విరుద్ధంగా మెప్మా అధికారి సి ఎం ఎం భాస్కర్ రెడ్డి ఏకపక్షంగా సోమశేఖరమ్మ, వీరనారాయణమ్మ, కే లక్ష్మీదేవి లని కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారని సర్వసభ్య సమావేశంలో వీరు ఎన్నికల్లో నిల్చున్నా సభ్యుల మద్దతు లభించలేదని అయినా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్న మెప్మా అధికారి అయిన భాస్కర్ రెడ్డి పై మెప్మా పీడీ, జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోగలరని కోరారు. ఈ సమావేశంలో లక్ష్మీదేవి, మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు.