గ్రహాంతరవాసులకు సందేశాలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : భూమిపైగల మానవులకు, భూమికి వెలుపలగల గ్రహాంతరవాసులకు మధ్య సంబంధాలు ఏర్పడటం కోసం మాధ్యమాలను తెరవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం నక్షత్రాల మధ్యకు సందేశాన్ని పంపించాలని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. కమ్యూనికేషన్ కోసం సరళ సూత్రాలు, ప్రాథమిక గణిత భావనలు, భౌతిక సూత్రాలు, డీఎన్ఏలోని భాగాలు, మానవులకు సంబంధించిన సమాచారం, భూమి, తిరిగి ఎవరైనా సమాధానం ఇవ్వాలని అనుకుంటే ఉపయోగపడేందుకు చిరునామా వంటివాటిని పంపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలకు జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన డాక్టర్ జొనాథన్ జియాంగ్ నాయకత్వం వహిస్తున్నారు.