జిల్లా కలెక్టర్ ని కలిసిన సెయింట్ జాన్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు
1 min read
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని,జూట్ ఉత్పత్తులను వినియోగించాలని మనవి
100 మంది మహిళలకు జుట్టు బ్యాగ్స్ తయారీ పై ఉపాధి, ఉచిత శిక్షణ
కలెక్టర్ కి అభినందనలు తెలియజేసిన సొసైటీ అధ్యక్షులు
పెరికె వరప్రసాదరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ఏలూరు జిల్లా కలెక్టర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈవేళ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ని కలవడం జరిగింది. సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పెరి కె వరప్రసాదరావు ఆధ్వర్యంలో 100 మంది మహిళలకు ఉచితంగా జ్యూట్ బ్యాగ్స్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని అందులో భాగంగా పరిసర ప్రాంతాల్లో క్యారీ బ్యాగులు ప్లాస్టిక్ నిషేధించాలని కలెక్టర్ ఆదేశాలు మేరకు మహిళలకు శిక్షణ ఇచ్చి ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లాలో ప్లాస్టిక్ నిషేధాన్ని గోడ పత్రికల ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన అవలంబించడం పట్ల కలెక్టర్ కి సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు పెరికే వరప్రసాదరావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు బదులు జూట్ ఉత్పత్తులు, పేపర్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు వాడాలని అదేవిధంగా సినిమా హాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యకర్తలు వీటిపై ప్రచారం చేయాలని ప్లాస్టిక్ బ్యాగ్ వాడటం వల్ల ఇరవై ఒక్క రకాల క్యాన్సర్ వ్యాధులు అరికట్టాలని అధికారులు, నాయకులు జోక్యం చేసుకొని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు పెరికె దీనగ్లాడి, సింధూర గ్రూప్ ప్రతినిధి పోతురాజు ,మేరీ తనూజ, డాక్టర్ ఫ్లోరా జోన్స్ జిల్లాకలెక్టర్ ని కలవడం జరిగింది. కలెక్టర్ సానుకూలంగాస్పందించారని ఒక ప్రకటనలో తెలిపారు.