భారత కంపెనీలో మైక్రోసాఫ్ట్ సీఈవో పెట్టుబడులు !
1 min readపల్లెవెలుగువెబ్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల గ్రో
అనే భారత కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అలాగే ఈ సంస్థకు సలహాదారుడుగా సత్యనాదెళ్ల వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని గ్రో
సీఈవో లలిత్ కెశ్రే వెల్లడించారు. భారత్ లో ఆర్థిక సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న తమ ఆశయంతో సత్య నాదెళ్ల కలవడం సంతోషంగా ఉందన్నారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఐపీవో, యూఎస్ స్టాక్స్ , ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, బంగారంలో పెట్టుబడి పెట్టేడానికి గ్రో
ఫ్లాట్ ఫామ్ ను తయారు చేశారు. ప్రస్తుతం దీనికి 20 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. ఇప్పటికే పలు కీలక పెట్టుబడిదారులు గ్రో
సంస్థలో పెట్టుబడి పెట్టారు. సత్య నాదెళ్ల చేరికతో ఈ సంస్థ విలువ మరింత పెరిగింది.