మిడుతూర్ ఏపీఓ..సిబ్బంది బదిలీ
1 min read
నూతన ఏపీఓ గా నాగమ్మ..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ భూపణ జయంతి సంజామల మండలానికి బదిలీ అయ్యారు.ఉపాధి హామీ పథకం సిబ్బంది సాధారణ బదిలీల్లో భాగంగా ఏపీవో మరియు సిబ్బంది బదిలీపై వెళ్లారు.ఏపీవోగా పని చేస్తున్న నాగమ్మ ఇక్కడికి రానున్నారు. ఆమె ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.ఇక్కడి నుండి బదిలీపై వెళ్లిన టెక్నికల్ అసిస్టెంట్లు అలీఖాన్ పాములపాడు,నాగయ్య నందికొట్కూరు,రాములమ్మ జూపాడుబంగ్లా,సాంబశివుడు గడివేములకు బదిలీపై వెళ్లారు.కంప్యూటర్ ఆపరేటర్లు శ్రీరాములు పగిడ్యాలకు,ఉషా రాణి,జూపాడు బంగ్లాకు వెళ్లారు.ఏపీవో జయంతి 2022 ఫిబ్రవరిలో ఇక్కడ బాధ్యతలు చేపట్టారు.ఈమే బుధవారం ఇక్కడ రిలీవ్ అయ్యి గురువారం సంజామల ఏపీఓగా బాధ్యతలు చేపట్టారు.టెక్నికల్ అసిస్టెంట్లు ఉమేష్,సబిత,ఇజ్రాయేల్ రాజు,శ్రావణి ఇక్కడికి రానున్నారు.