మిడుతూర్ ఎంఈఓ ను వెంటనే నియమించాలి..
1 min read
ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు..
పల్లెవెలుగు మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల విద్యాశాఖ అధికారి-1 ను ఎఫ్ ఏసీ కింద ఎంఈఓ ను వెంటనే నియమించాలని ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి హృదయ రాజు బుధవారం అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎంఈఓ గా ఉన్న ఫైజున్నిసా బేగం సెలవులో ఉన్నందున వివిధ రకాలైన పాలనాపరమైన ఇబ్బందులు కలుగుచున్నాయి.వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు,హేతుబద్దీకరణ, బదిలీలు తదితర ప్రక్రియలు జరుగుచున్నవి.ప్రస్తుత ఎంఈఓ-1 జూన్ 3వ తేదీ వరకు సెలవులో ఉంటున్నందున మే నెల ఉపాధ్యాయుల జీతాలు మంజూరుకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మిడుతూరు మండలానికి ఎంఈఓ:1ఎఫ్ఏ సీ అధికారిని తక్షణమే నియమించాలని అన్నారు. నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి మరియు కడప ఆర్జెడీ శామ్యూల్ లకు ప్రాతినిధ్యం చేయడం జరిగిందని ఏపిటీఎఫ్ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శేషయ్య మల్లికార్జున తెలిపారు.