వలస బాట పట్టిన వ్యవసాయ కూలీలు
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అగ్రహారం,పెద్ద నేలటూరు, ఎర్రబాడు,పిల్లిగుండ్ల, బైలుప్పల, కులుమాల,చిన్న మరివిడు, పెద్ద మరివిడు, గంజిహళ్లి తదితర గ్రామాల నుండి గ్రామాల్లో ఉపాధి పనితో పాటు వ్యవసాయ పనులు లేక వ్యవసాయ కూలీలు మండలంలో వివిధ గ్రామాల నుండి అనేక కుటుంబాలు ఉపాధి కోసం మూట ముళ్ళ సర్దుకొని మిరపపంటను కోతకొయడానికి తెలంగాణ రాష్ట్రానికి మరియు గుంటూరు పట్టణానికి తరలి వెళ్లారు. అలాగే గ్రామాలలో ఉపాధి పనులు లేకపోవడం వలనే తాము మా యొక్కకుటుంబాలను పోషించుకోవడానికి సుగ్గి బాట పట్టామని కూలీలు తెలిపారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి. వేరుశనగ. ఉల్లి. మిరప వంటి పంటలు చేతి కందకుండా పోయాయని ,వేసుకున్న పంటలు కూడా సరిగా పండలేదని వారు తెలిపారు. చెసిన అప్పులను తీర్చేందుకుగాను తాము వలస వెళ్లి పోతున్నామని కూలీలు చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ గ్రామాల్లో ఉపాధి పనులు కల్పిస్తే వలసలు వెళ్లకుండా గ్రామంలోనే జీవనం కొనసాగిస్తామని కూలీలు తెలిపారు.