పాలు రూ.1,195…గ్యాస్ సిలిండర్ రూ.2,657…!
1 min readపల్లెవెలుగు వెబ్ : శ్రీలంకలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. గ్యాస్ సిలిండర్ ధర 2,657 రూపాయలు కాగా.. కేజీ పాల ధర 1,195 రూపాయలకు చేరింది. నిత్యావసర వస్తువుల పై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడంతో ధరలు చుక్కలను తాకాయి. శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. కరోన దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వల పొదుపులో భాగంగా దిగుమతులు భారీగా తగ్గించింది. అయితే.. నిత్యావసర వస్తువులపై కూడ శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. దీంతో వస్తువుల మధ్య డిమాండ్, సరఫరా మధ్య భారీ వ్యత్యాసం వచ్చింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.