PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల‌క్ష‌లాది తేనెటీగ‌లు చంపేస్తున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లక్షలాది తేనెటీగలను ఆస్ట్రేలియా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మూలిస్తోంది. ప్రత్యేక చర్యల ద్వారా తేనెటీగల గుంపులను చంపివేస్తోంది. సూక్ష్మ క్రిమి ‘వర్రొవా ప్లేగు’ నుంచి తేనె పరిశ్రమను కాపాడుకోవడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. తేనె పరిశ్రమపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించే ‘వర్రోవా ప్లేగు’ వ్యాప్తిని నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నామని అక్కడి అధికారులు చెప్పారు. వేలాది తేనెటీగల గుంపులను నిర్మూలిస్తున్నామని వివరించారు. తేనెటీగల నిర్మూలిస్తున్న జోన్ విస్తీర్ణం ఆరు మైళ్లుగా ఉందని చెప్పారు. ఇప్పటికే మిలియన్ల కొద్దీ తెనేటీగలను నిర్మూలించామని చెప్పారు.

                                      

About Author