యోగాతో.. ‘మైండ్’ కంట్రోల్..!
1 min readఆసనాలతో అత్యద్బుత ఫలితం..
- యోగా గురువు సుధాకర్
- 19 నుంచి యోగాపై శిక్షణ
పల్లెవెలుగు, కర్నూలు:స్థిరత్వం లేని ఆలోచనతో నిండి ఉన్న ‘మైండ్’ ను కంట్రోల్ చేసే శక్తి ఒక్క యోగాకే సాధ్యమవుతుందన్నారు యోగా గురువు సుధాకర్. యోగాసనాలతో అత్యద్భుత ఫలితం పొందుతారన్న ఆయన … యోగాను నిత్యకృతిలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. ఆదివారం నగరంలోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగాపై గురువు సుధాకర్ అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. మద్యం, సిగరెట్లు… అపరిమితంగా సెల్ఫోన్లు చూడటం… సినిమాలు చూడటం వంటివి చేయడం వల్ల మనిషి మానసిక స్థితి కుచించుకుపోతోంది. అంతేకాక డృడ సంకల్పంతో కూడిన మంచి ఆలోచనలు, గట్టి నిర్ణయాలు స్వతహాగా తీసుకునే శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటివన్నీ కంట్రోల్ కావాలంటే…. ముందుగా మెదడు (మైండ్)ను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది ఒక్క యోగాతోనే సాధ్యమవుతుందని, అందుకే ప్రతి ఒక్కరు యోగాసనాలు చేయాలని ఈ సందర్భంగా యోగా గురువు సుధాకర్ వెల్లడించారు. అనంతరం హార్ట్ ఫౌండేషన్ సభ్యులు యోగా గురువు సుధాకర్‌ను ఘనంగా సన్మానించారు.
19 నుంచి యోగాపై శిక్షణ..
నగరంలోని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యాలయ ఆవరణలో ఈ నెల 19 (మంగళవారం) నుంచి పది రోజులపాటు యోగాపై శిక్షణ ఇస్తున్నట్లు గురువు సుధాకర్ వెల్లడించారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు యోగాపై ప్రత్యేక శిక్షణ ఇస్తామని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సెక్రటరి , ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. చంద్రశేఖర్, ప్రముఖ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్ వైద్య నిపుణులు డా. శంకర్ శర్మ, ముస్లిం మైనార్టీ జిల్లా అధికారి మహబూబ్ బాష , ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.