PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైండ్ కంట్రోల్ టెక్నాలజీ పరిశోధనలు మానవాళికి ముప్పు

1 min read

ఎన్ఆర్ఐ తరుణ్ రావి ఆందోళన

పల్లెవెలుగు వెబ్  విజయవాడ  :  మైండ్ కంట్రోల్ పరిశోధనలో మానవులకు తెచ్చే అవకాశం ఉందని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని మానవజాతిని బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎన్నారై తరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీనగర్ ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవుల ఆలోచనలను చదివి మానవ మెదడులను ప్రభావితం చేసే టెక్నాలజీనీ కొన్ని గుర్తుతెలియని సంస్థలు అభివృద్ధి చేసి మనుషులను గిన్ని పిగ్స్ వలె ఉపయోగించుకుంటున్నారని రావి తరుణ్ ఆరోపించారు. వినటానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవమని అన్నారు. ఉదాహరణకు సెల్ ఫోన్ ద్వారా మనం ఏం చేస్తున్నామో ఎవరితో మాట్లాడుతున్నామో, ఏ ఊరు వెళ్తున్నాము ఎక్కడ ఉంటున్నామో  విషయాలు తెలుస్తున్నాయని ఉదాహరణకు ఏదైనా ప్యాంట్ షర్టు గురించి గూగుల్ లో వెతికితే వెంటనే దానికి సంబంధించిన మొత్తం మన మొబైల్లో ప్రత్యక్షమవుతాయని అంతేకాకుండా అనేక కంపెనీల నుంచి తమ ప్రోడక్ట్ కొనమంటూ మెసేజ్ లు వస్తాయని ఆ విషయాలు ఆ కంపెనీలకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అంటే మన యొక్క డీటెయిల్స్ ని మన వెతికిన సంస్థ లేదా ఆ సాఫ్ట్వేర్ మిగిలిన పలానా ఎక్స్  షర్టు ప్యాంట్లు కావాలని అడుగుతున్నారని మిగిలిన కంపెనీలకు పంపిస్తాయని ఉన్నారు అంటే మన యొక్క వివరాలను అమ్మేస్తున్నారని అన్నారు.మన ఆలోచనలను చదివటం దగ్గర నుండి మన ఆలోచనలను దారి మళ్ళించే విధంగా పరిశోధనలు చేస్తూ గిన్ని పిగ్స్ గా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు లాగే వైజాగ్ లో ఎక్స్ అనే అతనిని టార్గెట్ చేస్తే ఆ బాధలు భరించలేక అమెరికా వదిలి వైజాగ్ వచ్చేసారని అన్నారు. మూడు నెలల క్రితం హవానా సిండ్రోమ్ వివరాలు తెలపాలంటూ కర్ణాటక హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అదేవిధంగా ఇటువంటి బాధితులు అనేక మంది ఉన్నారని అన్నారు. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సైంటిస్టులు బహిరంగంగా చేసిన పరిశోధనల పట్ల విచారణ వ్యక్తం చేస్తున్నారని అన్నారు.  1953లో అమెరికా  ఎంకే ఆల్ట్రా పేరుతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారని అపరిశోధనల ఫలితమే ఈన్యూరో వెపన్స్, ఎనర్జీ వెపన్స్ అని అన్నారు.ఈ వెపన్స్ మానవ మెదళ్ళను ప్రభావితం చేస్తాయని తద్వారా ఆలోచనలను తెలుసుకొనటమే కాకుండా మనిషిలో అనేక రకమైన బాధలను కలిగిస్తాయని, దీనినే హావానా సిండ్రోం అంటారని అన్నారు.హావాన సిండ్రోం బారిన పడిన వారిలో అనేకమంది ప్రఖ్యాతి చెందిన సైంటిస్టులు డాక్టర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని వారిలో అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయవేత కమల్ హారిస్ ఉన్నారని,డాక్టర్ లెన్ బెర్, డాక్టర్ రాబర్ట్ డంకన్, డాక్టర్ కేథరీన్ హోర్టన్, డాక్టర్ జాన్ హాల్  ఉన్నరని అన్నారు. నిద్ర లేకపోవడం రిమోట్ థాట్ రీడింగ్ ప్రసారం,మసక దృష్టి, డ్రీమ్ మానిప్యులేషన్,మూడ్ మార్పు మైక్రోవేవ్ వాయిస్ టు స్కల్ – మెదడులోకి ఎలక్ట్రానిక్‌గా బేసి శబ్దాల ప్రొజెక్షన్ చేస్తారని వివరించారు.మాజీ సిఐఎ డాక్టర్ రాబర్ట్ డంకన్ ఇంటర్వ్యూయర్ మాజీ మిన్నెసోటా గవర్నర్ జెస్సీ వెంచురాతో మాట్లాడుతూ తాను ఈ ఆయుధాలలో కొన్నింటిని అభివృద్ధి చేశానని మరియు ప్రభుత్వం ఆ ఆయుధాలతో పౌరులను హింసిస్తోందని ఆరోపించారు. రాబర్ట్ డంకన్ టార్గెటెడ్ వ్యక్తులు వెర్రి కాదు వారికి ఎలాంటి మానసిక సమస్యలు ఉండవని కూడా చెప్పారనిఅన్నారు.మనస్సులోకి బలవంతంగా ప్రవేశించడం అనేది నిర్వచనం ప్రకారం అశ్లీలమైనప్పటికీ, మనస్సు-ఆక్రమించిన వ్యక్తులు వివరించే ప్రభావాల యొక్క సంక్షిప్త అంచనా ప్రయోగాల యొక్క వికృత స్వభావానికి సాక్ష్యమిస్తుందన్నారు.  వికారమైన శబ్దాలు శరీరం నుండి విడుదలవుతాయి, శబ్దాలను బాహ్యంగా గుర్తించడానికి దాని యజమానికి బాగా తెలిసిన శరీరం;  సైకిల్ పంపు ద్వారా గాలి లోపలికి మరియు బయటికి పంప్ చేయబడుతుంది.  క్రమంగా కచేరీలు పెరుగుతాయని కళ్ళు, ముక్కు, పెదవులు, వింత సంకోచాలు, తలలో నొప్పులు, చెవులలో రింగింగ్, గొంతులో అడ్డంకులు, ప్రేగు మరియు మూత్రాశయం మీద ఒత్తిడి,  వేళ్లు, పాదాలలో జలదరింపు, గుండెపై ఒత్తిడి, శ్వాస తీసుకోవడం, కళ్లు తిరగడం, కంటి శుక్లాలకు దారితీసే కంటి సమస్యలు;  నడుస్తున్న కళ్ళు, నడుస్తున్న ముక్కు;  హృదయ స్పందనలను వేగవంతం చేయడం మరియు గుండె మరియు ఛాతీలో ఒత్తిడిని పెంచడం;  బ్రోన్కైటిస్ మరియు ఊపిరితిత్తుల క్షీణతకు దారితీసే శ్వాస ఛాతీ ఫిర్యాదులు;  వేదన కలిగించే మైగ్రేన్లు;  రాత్రిపూట మేల్కొలపడం, కొన్నిసార్లు భయంకరమైన కుదుపుల నిద్రలేమి, ఒకరి గోప్యత కోల్పోవడం వల్ల భరించలేని ఒఓత్తడికి గురి చేస్తారని అన్నారు.అంతే కాక మన బ్యాంక్ పాస్ వర్డ్ రీడ్ చేయడం,మర్చిపోయాలా చేస్తారని అన్నారు.తక్షణమే ప్రభుత్వాలు కలుగజేసుకొని  మానవ మెదడుపై పరిశోధనలకు అడ్డుకట్ట వేయాలని లేనిపక్షంలో భవిష్యత్తరాలకు తీరం నష్టమే జరగటమే కాకుండా కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మారే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి భారత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన హవానా సిండ్రోంపై దృష్టి సారించాలని కోరారు.

About Author