గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం : తరతరాలుగా గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలను శుభ్రం చేయడం పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజలు అంటురోగాల బారిన పడకుండా సేవలు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి యేసు రత్నం సిఐటియు పాణ్యం మండల కార్యదర్శి భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప పంచాయతీ కార్మికుల జీవితాలు మాత్రం ఏ మార్పు లేదు ఏ ప్రభుత్వమైనా తమ జీవితాలు మారుస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు సంవత్సరాలు గడుస్తున్న వేతనాలు పెంచడం లేదని సౌకర్యాలు కల్పించడం లేదని. వైసీపీ ప్రభుత్వం వస్తే తమ జీవితాలు మారుతాయి అని ఆశతో ఎదురు చూశారని నిరాశ మాత్రమే మిగిలిందని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గ్రామపంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. టెండర్ విధానం రద్దు చేసి 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని సంవత్సరాలు తరబడి పోరాటాలు చేస్తున్న చూస్తాం చేస్తామని ఆశ చూపుతున్నారే తప్ప ఏ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించడం లేదు. 30 40 సంవత్సరాల నుంచి పనులు చేస్తున్న తగిన గుర్తింపు లేదు. నేటికీ కనీస వేతనం అమలు కావడం లేదు. సంవత్సరంలో అనేకమార్లు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిన గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగవు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ప్రాణాలకు తెగించి పనిచేసిన గుర్తింపు లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాల జీవో అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలనివారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకుడు ప్రతాప్. గ్రామపంచాయతీ కార్మికులు శ్రీరాములు దినేష్. ప్రవీణ్ .లక్ష్మీదేవి సుబ్బారావు .తదితరులు పాల్గొన్నారు.