PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైనింగ్ చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడండి…

1 min read

– జిల్లా కలెక్టర్ శ్రీ పి. కోటేశ్వరరావు
పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మైనింగ్ దారులను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు కేటాయించిన గనులలో పనులు చేసి జిల్లా అభివృద్ధికి మరియు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరినారు.గౌరవనీయులైన A.P ముఖ్యమంత్రి 6.10.22 న సమీక్ష నిర్వహించి నాన్-వర్కింగ్ మైనర్ మినరల్ లీజుల గురించి కార్యాచరణ మరియు అటువంటి లీజుల రద్దుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, అటువంటి లీజు హోల్డర్‌లు ఆపరేషన్‌ను పునః ప్రారంభించేలా ప్రేరేపించడానికి మరియు సులభతరం చేయడానికి అన్ని ప్రయత్నాలను చేయాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆదేశించారు. నాన్ ఆపరేషన్లకు గల కారణాలను విశ్లేషించాల్సిందిగా , పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు లేదా మరేదైనా కారణాలు ఉన్నట్లయితే, ఆ కారణాలను గుర్తించి, అంచనా వేసి మైనింగ్ లీజుదారులందరూ డిప్యూటీ డైరెక్టర్/అసిస్టెంట్ డైరెక్టర్ గనులు మరియు కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సహాయంతో కలెక్టర్ ముందు హాజరు కావాలని ఆదేశించారు. అటువంటి లీజు హోల్డర్లందరితో సమావేశం నిర్వహించి, అటువంటి లీజులు అమలులోకి వచ్చేలా తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కర్నూలు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నేడు జరిగిన సమావేశానికి కలెక్టర్ శ్రీ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ శ్రీ రామసుందర్ రెడ్డి జిల్లాలోని మైనర్లు అందరూ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు జిల్లా మైనింగ్ అధికారులు పాల్గొన్నారు . మైన్స్ సరెండర్ చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి కలెక్టర్ గారు సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరినారు.రకరకాల పర్మిషన్స్ కొరకు తిరగటానికి సమయం సరిపోవడం లేదు కావున కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ లకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేందుకు ఒక కార్యాలయాన్ని లేదా ఒక విండో ఏర్పాటు చేసి లీజ్ దారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన జీవో ల ప్రకారము మరియు గైడ్లైన్స్ ప్రకారము మాత్రమే మేము పని చేస్తాము .మీ కొరకు మీ సూచనలు వీలు ఐయిన మేరకు కొన్నిటిని వెంటనే పరిష్కరిస్తాము. మీ మైన్ లీజులు ప్రకారము మీరు వెంటనే పనులు ప్రారంభించాలని కోరినారు . లీజ్ దారుల విజ్ఞప్తి మేరకు అన్ని కార్యాలయాల నుండి ఒక్కొక్కరిని తీసుకొని అక్కడే అన్ని కార్యాలయాల పనులు జరగటానికి లీజ్ దారులకు ఒక సెల్ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి నాగిని ని మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అయిన శ్రీ డి.వై .ముని ప్రసాద్ గారిని ఆదేశించినారు. మీ సమస్యలన్నీ వివరంగా తెలిపిన వాటికి మా నుంచి చేయవలసిన సహాయ సహకారాలు అన్ని అందిస్తాము . త్వరలో మరో సమావేశంలో ఆ విషయాలు మీకు తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు.

About Author