NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తీన్మార్ మ‌ల్లన్న పై మంత్రి ఆగ్రహం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తీన్మార్ మ‌ల్లన్న పై మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టని వారు పంపుతున్న వీడియోల‌తో ఇంట్లో కూర్చొని విమ‌ర్శించ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌టం స‌రికాద‌ని అన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకే ప్రభుత్వం మిష‌న్ భ‌గీరథ తీసుకొచ్చింద‌ని చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్కులో 40 కోట్లతో నిర్మించిన 10 ల‌క్షల మిష‌న్ భ‌గీర‌థ మంచినీటి రిజర్వాయ‌ర్ ట్యంక్ ను ఆయ‌న ప్రారంభించారు. సుమారు ప‌ది కిలోమీట‌ర్ల వ‌రకు మంచినీటి పైప్ లైన్ వేయ‌డం పూర్తైంద‌ని తెలిపారు. ఈ ట్యాంకు ద్వార జిల్లాలోని ప్రతి ఇంటికి నీరు అందుతుంద‌ని తెలిపారు.

About Author