NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి అనిల్ 100 కోట్ల దోపిడీ : టీడీపీ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ 100 కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడ్డాడ‌ని టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు. పెన్నా న‌దిలో వంద కోట్ల ఇసుక‌ను మంత్రి అనిల్ అనుచ‌రులు అక్రమంగా విక్రయిస్తున్నార‌ని విమ‌ర్శించారు. నెల్లూరులోని పెన్నాన‌ది నూత‌న బ్రిడ్జి వ‌ద్ద టీడీపీ కార్యక‌ర్తల‌తో క‌లిసి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆందోళ‌న నిర్వహించారు. నెల్లూరులో పార్క్ గ్యాంగ్ చేస్తున్న అక్రమాల‌ను కలెక్టర్ అరిక‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఇసుక అక్రమాల‌కు పాల్పడిన మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ను బ‌ర్తర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీదారుల మీద కేసు న‌మోదు చేయ‌క‌పోతే కోర్టుకు లాగుతామ‌ని కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి హెచ్చరించారు.

About Author