PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ హీరో మాట మేమెందుకు వింటాం?: కొడాలి నాని

1 min read


పల్లెవెలుగు వెబ్: మంత్రి కొడాలి నాని…. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శవాల మీద చిల్లర ఏరుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల కోసం ఆఖరికి తన భార్యను అల్లరి‌పాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీలో, బయట ఎక్కడా అసలు చంద్రబాబు భార్య పేరును తాము ఎత్తలేదని కొడాలి స్పష్టం చేశారు. తాను అనని మాటలకు క్షమాపణ ఎందుకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ తమను ఎలా కంట్రోల్ చేస్తాడని.. ఆయన మాట తామెందుకు వింటామన్నారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు.. నందమూరి కుటుంబం చంద్రబాబును నమ్ముతుందన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉంటే టీడీపీ నాశమవుతుందని చంద్రబాబు చెబితే..గుడ్డిగా నమ్మింది నందమూరి కుటుంబ సభ్యులేనని ఈ సందర్బంగా కొడాలి నాని గుర్తు చేశారు.

About Author