పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కన్నుమూత
1 min read
పల్లెవెలుగు వెబ్:పశ్చిమ బెంగాల్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు పశ్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. సుబ్రతా ముఖర్జి మరణ వార్త తెలుసుకున్న వెంటనే దీదీ ఆస్పత్రి వద్దకు వెళ్లారు. ఆయన మరణం పట్ల మమతాబెనర్జీ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన లేరన్న వార్తను నమ్మలేకపోతున్నానని అన్నారు. సుబ్రతా ముఖర్జి ఎంతో నిబద్ధత కలిగిన నేత అని అన్నారు. ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీరనిలోటని అన్నారు. తీవ్రమైన శ్వాససంబంధమైన ఇబ్బందులు తలెత్తడంతో ఆయనను ఐసీయూలోకి తరలించి చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.