మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానం.. అలా ఉండటమే ఇష్టం !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీకి చెందిన మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానమని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యేగా ఉండడమే తనకు ఇష్టమని చెప్పారు. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానని తెలిపారు. ఏపీ శ్రీలంకలా మారుతుందని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే ఏపీ సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ను కోల్పోవడంతోనే ఏపీని రెండు ముక్కలై నాశనమయ్యిందని కొడాలి నాని గుర్తుచేశారు.