ఆ మంత్రి ఇంటా తీవ్ర విషాదం
1 min read
పల్లెవెలుగు వెబ్: తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటా తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి శాంతమ్మ… హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందారు. గుండెపోటు రావడంతో శాంతమ్మ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె అంత్యక్రియలు మహబూబ్ నగర్ లో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతమ్మ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా, గత కొంతకాలం క్రితమే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి మృతి చెందిన విషయం తెలిసిందే.