సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి టి.జి భరత్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రేపు కర్నూల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పరిశీలించారు. సీ.క్యాంపు రైతు బజార్లో మినిట్ టూ మినిట్ సీఎం చంద్రబాబు కార్యక్రమానికి అనుగుణంగా ఏర్పాట్లు ఎలా చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న పారిశుధ్య పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ రైతు బజార్ విస్తరణకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి తెలిపారు.