బ్యాడ్మింటన్ పోటీల్లో విజయం సాధించిన మంత్రి టీజీ భరత్
1 min read
విజయవాడ న్యూస్ నేడు : విజయవాడలో ఏపీ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్-2025 ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు ఇండోర్ స్టేడియంలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, పితాని సత్యనారాయణ టీంతో షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు. డబుల్స్ బ్యాడ్మింటన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివరకు15-10 పాయింట్లతో మంత్రి టీజీ భరత్, ప్రత్తిపాటి పుల్లారావు టీమ్ విజయం సాధించింది. అనంతరం సింగిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో కలిసి మంత్రి టీజీ భరత్ బ్యాడ్మింటన్ ఆడారు. 21-10 తేడాతో ఆర్.ఆర్.ఆర్ పై మంత్రి టీజీ భరత్ విజయం సాధించారు.
