NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

థియేట‌ర్ల బంద్ పై స్పష్టత ఇచ్చిన మంత్రి

1 min read

క‌రోన కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో థియేట‌ర్ల బంద్ కు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంద‌న్న వార్తల నేప‌థ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ స్పందించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ థియేట‌ర్లు య‌థావిధిగా న‌డుస్తాయ‌ని తెలిపారు. థియేట‌ర్లు మూసివేస్తార‌న్న వార్తల్లో నిజం లేద‌ని తెలిపారు. లాక్ డౌన్ ఫ‌లితంగా ఇప్పటికే సినిమా ప‌రిశ్రమ తీవ్రంగా న‌ష్టపోయింద‌ని తెలిపారు. థియేట‌ర్లు మూసి వేస్తే.. సినిమా నిర్మాణం ఆగిపోతుందని, ఫ‌లితంగా చిన్న న‌టీన‌టులు తీవ్రంగా ఇబ్బంది ప‌డ‌తార‌న్నారు. థియేట‌ర్ల మూసివేత విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేద‌ని.. ఇలాంటి పుకార్ల న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపారు.

About Author