మంత్రి పదవి ఎఫెక్ట్.. బాలినేని శ్రీనివాస్ కీలక ప్రకటన ?
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి నివాసంలో ముఖ్య నేతలు కీలక భేటీ నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నాయకులతో బాలినేని సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు బాలినేని నివాసానికి చేరుకున్నారు. బాలినేనిని మార్కాపురం ఎమ్మెల్యే కొండారెడ్డి కలిశారు. మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ నేత మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల వచ్చి బుజ్జగించినప్పటికీ బాలినేని వెనక్కి తగ్గని పరిస్థితి. మరి కొద్దిసేపటిలో కీలక నిర్ణయం ప్రకటన చేసే యోచనలో బాలినేని ఉన్నట్లు తెలుస్తోంది.