NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రులు ప‌రిధి దాటి మాట్లాడుతున్నారు ..సీఎం జ‌గ‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీ, తెలంగాణ మ‌ధ్య కొన‌సాగుతున్న జ‌ల‌వివాదం పై సీఎం జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు ప‌రిధి దాటి మాట్లాడుతున్నార‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించినట్టు స‌మాచారం. తెలంగాణ‌లో ఏపీ ప్రజ‌లు ఉన్నార‌ని, వారిని ఇబ్బంది పెడ‌తార‌న్న ఉద్దేశంతో ఎక్కువ‌గా మాట్లాడ‌టం లేద‌ని అన్నారు. అలాగ‌ని ఏపీ రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేద‌ని తేల్చి చెప్పారు. నీటి విధానంలో ఎలా ముందుకు వెళ్తే మంచిదో ఆలోచించి ముందుకు వెళ్లాల‌ని సూచించారు. విద్యుత్ కోసం తెలంగాణ అనుమ‌తి లేకుండా నీటిని వాడుకోవ‌డం పై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డుకు లేఖ‌ రాయాల‌ని సూచించారు. నీటి వివాదం పై ప్రధాన‌మంత్రికి లేఖ రాయాల‌ని ఏపీ మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ సూచించారు.

About Author