NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి పేర్ని నాని, ఆర్జీవి మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు పై మంత్రి పేర్ని నాని, ద‌ర్శ‌కుడు ఆర్జీవీ మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ కొన‌సాగుతోంది. ఈనేపథ్యంలో వర్మ అడిగిన ప్రశ్నలకు బుధవారం ఉదయం మంత్రి నాని సమాధానమిచ్చారు. ‘రూ.100 టికెట్‌ను రూ.1000, రూ.2000కు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్‌ మెకానిజం అంటారు? డిమాండ్‌, సప్లయ్‌ అంటారా? లేక బ్లాక్‌ మార్కెటింగ్‌ అంటారా?’ అంటూ నాని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి వ్యాఖ్యలపై రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు. ‘‘రాజకీయ నాయకుడిగా కాకుండా గౌరవప్రదంగా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు నానీ గారూ. రూ.100 టికెట్‌ని వెయ్యికి అమ్ముకోవచ్చా అనేది అసలు ప్రశ్నే కాదండి. ఎందుకంటే అది అమ్మేవాడి నమ్మకం.. కొనేవాడి అవసరంపై ఆధారపడి ఉంటుంది. ముడి పదార్థం రూ.500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్‌ని కొనేవాడుంటే రూ.5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికే విలువ ఇస్తే దాని బ్రాండ్‌కి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌ అనేది ఉన్నదానికంటే బెటర్‌గా ఉండేలా ప్రయత్నించాలి. ఇక అది బెటరా? కాదా? అనేది కొనుగోలుదారుడే నిర్ణయిస్తాడు. కొనేవాడికి, అమ్మేవాడికి మధ్య లావాదేవీలు ఎంత జరిగాయనే పారదర్శకత మాత్రమే ప్రభుత్వానికి అవసరం“ అని అన్నారు.

                                                 

About Author