PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

300 కోట్లు విలువచేసే స్థలాన్ని కొట్టేసిన మంత్రి తమ్ముడు..సిపిఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగినది విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు నగర పార్టీ కార్యవర్గ సభ్యులు కాజా హుస్సేన్ బీసన్న ఈశ్వర్ సోమన్న పాల్గొన్నారు నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్నూల్ నగరంలోని 17వ వార్డు నందు 300 కోట్ల విలువచేసే బిడ్డ బుడ్డి మసీదు మాన్యాన్ని సర్వే నెంబరు 9 27 గల భూమిని ఆక్రమించుకొని విద్యాసంస్థలు ప్లేగ్రౌండ్స్ నిర్మాణం చేసి  చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది దాదాపుగా ఒక ఎకరా 20 కోట్ల రూపాయలు ఉంటుందని 15 ఎకరాలని కబ్జా చేయడంతో ప్రభుత్వానికి వచ్చే 300 కోట్ల రూపాయలు లాస్ అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ ప్రభుత్వం క్యాబినెట్లో  మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ తమ్ముడు ఆదిమూలపు సతీష్ కబంధహస్తాలలో 15 ఎకరాలు ఉంది ప్రభుత్వ అధికారులు కూడా ఈ స్థలాన్ని చూసి చూడనట్లు వ్యవహరించడం చాలా దుర్మార్గం జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ స్థలంపై విచారణ చేసి ఆదిమూలపు సతీష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సతీష్ కు సహకరించిన మున్సిపల్ శాఖ మంత్రి వర్గం నుండి తొలగించాలని వారి డిమాండ్ చేశారు అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ముందు దాదాపు 80 అడుగుల రోడ్డు ఉండగా అందులో ఆదిమూలపు సురేష్ తమ్ముడు ఆదిమూలపు సతీష్ సాయి సత్య హాస్పిటల్ కి ఎదురుగా చిన్నచిన్న షాపులు నిర్మాణం చేసి బాడుగులకు ఇచ్చుకొని దర్జాగా అనుభవిస్తున్నారు రాయలసీమ బీఈడీ కాలేజీ మెయిన్ గేటుకు ఇరువైపులా 20 అడుగుల రోడ్డు నాక్రమించుకొని పార్కు నిర్మాణం చేసి పార్కు నానుకొని రోడ్డుపైనే ఆదిమూలపు సతీష్ సురేష్ తల్లిదండ్రుల విగ్రహాలను ప్రతిష్టించడం వ్యవహారాన్నంత మున్సిపల్ అధికారులు చూస్తూ ఉండడం ఏమీ చేయలేకపోవడం చాలా దారుణమని కర్నూల్ నగరంలో ఊర్లు వదిలి పొట్టకూటికోసం కుటుంబ జీవనోపాధి కోసం రోడ్డుకి ఇరువైపులా తోపుడు బండ్లు చిన్న చిన్న బంకులు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటే ట్రాఫిక్ ఇబ్బందని తొలగిస్తా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అధికారులు మరి ఆదిమూలపు సురేష్, సతీషు ఆక్రమించుకున్న పార్కు రోడ్డుపై ప్రతిష్టించిన విగ్రహాలు కమిషనర్ కి కనపడతలేవా అని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు మున్సిపల్ అధికారులు స్పందించకుంటే భవిష్యత్తులో జరిగే ఆందోళనకి కమిషనరే బాధ్యత వహించాల్సి వస్తుంది 17వ వార్డు ప్రజలను కలుపుకొని ఉద్యమం చేపడతామని వారు సందర్భంగా హెచ్చరించారు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను తీసుకొనిఆదిమూలం సతీష్ సురేష్ కబ్జా చేసిన బుడ్డ బుడ్డి మసీదు మాన్యం స్థలాన్ని అలాగే అక్రమంగా నిర్మాణం చేసిన షాపులు పార్కులు విగ్రహాలను స్థలాలను ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో కలిసి పరిశీలించడం జరిగినది పరిశీలన కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ కే జగన్నాథం రామచంద్ర భాష రాజు బాబయ్య మరియు పార్టీ సానుభూతిపరులు 17వ వార్డు ప్రజలు సందర్శించడం జరిగింది.

About Author