NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొత్త‌పార్టీ ఏర్పాటు పై కాపునేతల‌ మంత్రాంగం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొత్త పార్టీ ఏర్పాటు పై కాపు నేత‌లు దృష్టిపెట్టారు. కాపుల రాజ్యాధికారమే ల‌క్ష్యంగా పావులు క‌ద‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. కాపు వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌లు హైద‌రాబాద్లోని హోట‌ల్ ద‌స్ ప‌ల్లాలో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి పరాజయం చేందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్‌తో పాటు తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు, కాపు రిజర్వేషన్‌ పోరాట సాధన సమితి కన్వీనర్‌ ఆరేటి ప్రకాశ్‌, కాపు సంఘం నేతలు కేవీ రావు, ఎంహెచ్‌ రావు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం… అధికారమే లక్ష్యంగా గతంలో అడుగులు వేసిన మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లా విఫలం కాకుండా.. ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. గెలుపోటములను ప్రభావితం చేసేంత బలం ఉన్నప్పటికీ.. వేరొకరు పీఠం ఎక్కేందుకు ఉపయోగపడుతున్నామే గానీ.. సొంతగా అధికారాన్ని దక్కించుకులోకపోతున్నామనే భావన వ్యక్తీకరించారు.

                                            

About Author