మైనర్ బాలికది.. ఆత్మహత్యే..
1 min read
మాట్లాడుతున్న డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి
– నిర్ధారించిన పోలీసులు, వైద్యులు
పల్లెవెలుగు వెబ్, బనగానపల్లె: మండలంలోని యాగంటిపల్లెలో గురువారం రాత్రి తన నివాసంలో మృతి చెందిన అనూష(16)ది హత్యా.. ఆత్మహత్యా… అని ప్రజలు పలు సందేహాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, డాక్టర్ చరణ్, బనగానపల్లె సీఐ ఎం. సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐలు కృష్ణమూర్తి, డి. మహేష్ కుమార్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. యాగంటిపల్లెలో జీఎన్ఎస్ఎస్ కాలువ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ దంపతుల కుమార్తె అనూష.. క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కొన్ని కారణాలతో తండ్రి మందలించడంతో అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. శవపరీక్షలో కూడా ఆత్మహత్యగా కనిపిస్తోందని డా. చరణ్ తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.