PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మినుముల మిషన్ బోల్తా.. ఇద్దరు మహిళ కూలీలు మృతి

1 min read

– డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం
– శాతానకోట గ్రామంలో విషాదఛాయలు
– మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థర్ పరామర్శ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొ ట్కూరు మండల పరిధిలోని శాతన కోటలో గ్రామంలో మినుము పంట నూర్పు టాక్టర్ మిషన్ బోల్తా పడి నాగలక్ష్మి, అనురాధ ఇద్దరు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వాటి వివరాలు శాతనకోట గ్రామ మహిళలు మంగళవారం ఉదయం జక్కుల వెంకటస్వామి పొలానికి మినుము పంట నూర్పిడి పనులకు ఆరు మంది కూలీలు వెళ్ళారు. పని ముగించుకుని ఇంటికి ఏపీ 39 ఎంఎల్ 2510 నెంబర్ గల సోనాలిక ట్రాక్టర్ మీద ఎక్కి తిరుగు ప్రయాణంలో అల్లూరు, శాతన కోట పొలాల మధ్యలో అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు మిషన్ బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు ,మరోక మహిళా కూలీ ఖాజాబీకి కాలు విరిగింది. ఇద్దరు మహిళలు మృతి సంఘటనతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సంఘటన విషయం తెలుసుకున్న నందికొట్కూరు రూరల్ సిఐ సుధాకర్ రెడ్డి, బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై ఓబులేసు హుటాహుటిన వెళ్లి సంఘటన స్థలానికి చేరుకొని ట్రాక్టర్ డ్రైవర్ రమణ ను విచారించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఓబులేసు తెలిపారు.మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు పరశురాముడు, నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మృతురాలు అనురాధ కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరందరూ తొమ్మిది, ఐదు రెండు సంవత్సరాల చిన్నారులు .విషయం తెలుసుకున్న నియోజవర్గ ఎమ్మెల్యే ఆర్థర్ హుటాహుటిన నందికొట్కూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం అందించారు.మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

About Author