నిధులు దుర్వినియోగం..
1 min readదెందులూరు పూర్వపు సర్పంచ్ కు, పంచాయతీ కార్యదర్శికి తాఖీదు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : దెందులూరు గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఏలూరు డివిజనల్ పంచాయతీ అధికారి చంద్రశేఖర్ విచారణలో తేలింది. స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు మేరకి జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ విచారణ చేపట్టమని ఏలూరు డివిజనల్ పంచాయతీ అధికారి చెంద్రశేఖర్ ని ఆదేశించగా సుమారు ఒక కోటి తొమ్మిది లక్షలు రూపాయలు దుర్వినియోగం అయ్యాయని విచారణలో తేలింది. ప్రజలకు నుంచి వసూలు చేసిన ఇంటిపన్ను నగదును ప్రభుత్వ ఖజానాకు కట్టకుండా స్వంతానికి వాడుకున్నట్టు అలాగే గ్రామ పంచాయతీ సాధారణ నిధులను సర్పంచ్ టి. యేసమ్మ, దెందులూరు పూర్వపు పంచాయతీ కార్యదర్శి యెహోసువా సొంత బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసినట్టు విచారణలో గుర్తించినట్టు తెలిసింది. కాగా దెందులూరు గ్రామ పంచాయతీలో రూ. 1,09,36,044/- నిధులు దుర్వినియోగం అయ్యాయని నివేదికను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ దృష్టికి జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తీసుకురాగా సర్పంచ్ టి. యేసమ్మకు, పూర్వపు పంచాయతీ కార్యదర్శి జి. యెహోషువాకు వివరణ కోరుతూ తాఖీదులు జరిచేసారు. విచారణలో సర్పంచ్ రూ 50,02,054/- కార్యదర్శి రూ 59,33,990/- నిధులు దుర్వినియోగం చేసినట్టు విచారణలో తేలింది. సర్పంచ్ యేసమ్మ, కార్యదర్శి యెహోసువా నుంచి వివరణ తీసుకొని అనంతరం శాఖపరంగా తుది చర్య చేపట్టడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసి, అవినీతికి పాల్పడివారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు.