గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం, పెద పులిపాక గ్రామపంచాయతీ లో ఇంటి పన్నులు , కుళాయి పన్నులు,చేపల చెరువుల లీజులపై ,వచ్చిన ఆదాయం రూ .9 లక్షల 43 వేల 294 రూపాయలు నిధులు దుర్వినియోగమైనట్లు, కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలు తెలియజేశారు. పెనమలూరు మండల పంచాయతీల విస్తరణాధికారి కె.శ్రీనివాసరావు జిల్లా పంచాయతీ అధికారికి తన నివేదికను సమర్పించినందున, నిధులు దుర్వినియోగానికి ,పాల్పడిన పంచాయితీ కార్యదర్శులు శ్రీమతి పి .భారతి , తదితరులపై గతంలోగ్రామ పంచాయితీ రికార్డులను, చార్జిలిస్టులను అప్పగించని పూర్వపు పంచాయతీ కార్యదర్శులు డి. సోమయ్య ,కుమారి ఎం. స్వరూపారాణి ,శ్రీమతి పి. భారతి, రికార్డులను స్వాధీన పరుచుకోని ప్రస్తుత కార్యదర్శి పి .పద్మావతి పై క్రమశిక్షణ చర్యలను జిల్లా పంచాయతీ అధికారి తీసుకోగలందులకు కృష్ణాజిల్లా కలెక్టర్ కి “స్పందన”లో విన్నవించడం జరిగిందని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో. తెలియజేశారు.