ఉయ్యూరు పంచాయతీలో నిధులు దుర్వినియోగం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: గతంలో ఉయ్యూరులో గ్రేడ్_1 పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసిన ఎం సుధార్ ఖాన్ ,వి రాజేంద్రప్రసాద్, ఎస్ .ఆనంద్ లపై క్రమశిక్షణ చర్యలు కొరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ని ఆదేశించిన రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి 2010 2011 సంవత్సరాలలో ఉయ్యూరు పంచాయతీలో 57 లక్షల 9 వేల 920 రూపాయలు నిధులు దుర్వినియోగం. పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకై సిఫార్సు చేసిన లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ డిప్యూటీడైరెక్టర్ పి. రాజకుమార్. కృష్ణా జిల్లా ఉయ్యూరు పంచాయతీలో ఏడు కోట్ల 19 లక్షల59వేల500 రూపాయలు వసూలుకు సంబంధించిన విజిలెన్స్ &ఎన్ఫోర్స్మెంట్ అధికారుల నివేదికపై చర్యలు తీసుకోని 2005 నుండి 2012 వరకు పనిచేసిన పంచాయితీ కార్యదర్శులు. ఎం. సుధార్ ఖాన్ ,వి.రాజేంద్రప్రసాద్, ఎస్ ఆనంద్ ల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ .ఫి.లక్ష్మణ్ రెడ్డి ఆదేశించారు సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ నివేదికపై ఉయ్యూరు నగర పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ది. ఫిబ్రవరి 7 ,2020 న రాష్ట్ర లోకాయుక్త కు ఫిర్యాదు చేయడం జరిగింది .విజిలెన్స్ నివేదికను కూడా అమలు చేయని ఉయ్యూరు నగర పంచాయతీ అధికారుల పనితీరుపై రాష్ట్ర లోకాయుక్త కార్యాలయం ఇన్వెస్టిగేషన్ డిప్యూటీ డైరెక్టర్ ను విచారణ చేయవలసిందిగా ఆదేశించారు. 2010, 2011 సంవత్సరాల్లో ఉయ్యూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వి. రాజేంద్రప్రసాద్ సమయములో జరిగిన 57 లక్షల9 వేల 920 రూపాయల నిధులు దుర్వినియోగం పై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర లోకాయుక్త పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు.అని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ప్రకటనలో తెలియజేశారు.