PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిస్ ఫైర్.. చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్ !

1 min read

పల్లెవెలుగు వెబ్: కృష్ణా జిల్లా క‌లెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. క‌లెక్టరేట్ ట్రెజ‌రీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస‌రావు గ‌న్ మిస్ ఫైర్ కావ‌డంతో ఆయ‌న చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన శ్రీనివాసరావును ఆస్పత్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం ఆయ‌న ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. గన్‌ను క్లిన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ట్రిగ్గర్ వద్ద తాడు బయటకు రావడంతో మిస్ ఫైర్ అయినట్లు సమాచారం. కలెక్టరేట్ లోని సీసీ కెమెరాలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసులు గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశించారు.

About Author