PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాన్ కార్డ్ మిస్ అయిందా?.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

1 min read

పల్లెవెలుగు వెబ్​: మ‌న దేశంలో పాన్ కార్డుకు .. ఆధార్ కార్డు త‌ర్వాత అంత‌టి ప్రాముఖ్య‌త ఉంది. ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఐటీఆర్ ఫైలింగ్, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద‌ర‌ఖాస్తు కోసం పాన్ కార్డు ఖచ్చితంగా అవ‌స‌రం. అలాంటి పాన్ కార్డు ఒక‌వేళ మిస్ అయితే.. మ‌ళ్లీ కొత్త‌ది తీసుకోవ‌డం కోసం చాలా ఇబ్బందిపడాల్సి వ‌స్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా కింది ప‌ద్ధ‌తి ద్వార పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.

 –   మొదట ఈ ఎన్‌ఎస్‌డీఎల్ పోర్టల్ లింకు ఓపెన్ చేయండి.
   – ఇప్పుడు పోగొట్టుకున్న మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
   – ఇప్పుడు మళ్లీ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, పిన్ కోడ్ నమోదు చేయాలి.
   – మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది.
    – ఆ ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీరు ఈ-పాన్ కార్డు పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

About Author