గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
1 min read
పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
మంత్రాలయం , న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చి తుంగభద్ర నది స్నానాలకు వెళ్లి గల్లంతైన ముగ్గురు కర్నాటక హాసన కు చెందిన డిగ్రీ ఫైనాలియర్ చదువే యువకులు శనివారం గల్లంతు అయ్యారు. అయితే చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఆదివారం ఉదయం నుండి పోలీసులు, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ అయితే గల్లంతు అయ్యారు అక్కడే ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. ప్రమోద్, అజిత్, సచిన్ మృతదేహాలు లభ్యం కావడంతో వారి తల్లిదండ్రులు కు అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు రోదనలతో తుంగభద్ర తీరం విషాదం గా మారింది. నిన్న సాయంత్రం పుణ్య స్నానాలకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాఘవేంద్రస్వామి దర్శనం కోసం మంత్రాలయం వచ్చిన ఏడుగురు స్నేహితులు డిగ్రీ చదువుతూ పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు మిత్రులతో కలసి ఏడుగురు యువకులు వచ్చారు. తుంగ తీరం రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలు వెలికి తీయడం లో సహయ సహకారాలు అందించిన మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ను అధికారులు అభినందించారు. ముందు గా తుంగభద్ర నది సంఘటన స్థలాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఎస్పీ ఉపేంద్ర బాబు, తహసీల్దార్ రమాదేవి, సిఐ రామాంజులు, ఎస్ఐ శివాంజల్ పరిశీలించారు.
