PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీ రంగాపూర : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కృషి వల్ల జిల్లాలో రైతులు పాడిపంటలతో ఉత్సాహంగా వ్యవసాయం చేస్తున్నారని మండల రైతు బంధు అద్యక్షులు గౌడ్ నాయక్ అన్నారు. మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీరంగాపురం మండల కేంద్రంలోని చెరువులో కొవ్వొత్తులు వెలిగించి గంగమ్మ తల్లికి దెబ్బోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గౌడ్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో రైతులు ఉత్సాహంగాల వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. కెసిఆర్ ముందు చూపు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కృషి వల్ల జిల్లాలోని చెరువులు కుంటలు ఎండాకాలంలో పుష్కలంగా ఉండడంతో రైతులు సంవత్సరానికి రెండు పంటలు పండిస్తున్నారు. పండిన పంటల సైతం ప్రభుత్వం రైతుల నుంచి గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా ఎదిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రైతులను రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కి అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటస్వామి. బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుల మహేష్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ ఆరిఫ్, నాయకులు కురుమూర్తి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author