మహిళా సాధికారతే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోంది – ఎమ్మెల్యే
1 min readమహిళలు మహారాణులు కావాలనేదే సీఎం జగనన్న లక్ష్యమన్నారు : ఎమ్మిగనూరు సమన్వయకర్త : శ్రీమతి బుట్టా రేణుక
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు మండలలో జరిగిన నవరత్నాలు అమలులో భాగంగా – 4వ విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. మండలంలోని గ్రూపులకు మంజూరైన రూ. 4.17 కోట్ల మెగా చెక్కును పొదుపు మహిళలకు ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” , ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక. నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” మట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. మహిళా ఆర్ధిక సాధికారత సాధించినప్పుడే కుటుంబ అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి గా గెలిపించుకోవాలని కోరారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శ్రీమతి బుట్టా రేణుక పోటీ చేస్తుందని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. శ్రీమతి “బుట్టా రేణుక” మాట్లాడుతూ మహిళలు మహారాణులు కావాలనేదే సీఎం జగనన్న లక్ష్యమన్నారు. అక్కాచెల్లమ్యల కోసం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చరన్నారు.అనంతరం సేవా పురస్కారాలు అందుకున్న వలంటీర్లతో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి గారు, సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక , నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, వారు మాట్లాడుతూ వలంటీర్లు అవినీతికి తావులేకుండా ప్రభుత్వ ఫలాలను పేదలందరికి చేరుస్తున్నారన్నారు. పల్లెల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హైల్త్ క్లీనిక్లు ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన సేవాలు అందించడం సంతోషకరమన్నారు. చంద్రబాబు హయంలో రైతులు వర్షాలు లేక, పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలకు గురయ్యారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్న జగనన్నను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బిఆర్. బసిరెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ, కో ఆప్షన్ మెంబెర్, జెడ్పీటీసీ, మండల జేసియస్ కన్వీనర్, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు ఎమ్మిగనూరు మండల అధికారులు తహశీల్దార్, ఎంపీడీఓ, డియర్ డిఓ పీడీ, డియర్ డిఓ, ఎపిఎం, వలెంటెర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.