మిషన్ వాత్సల్య పథకం దరఖాస్తు గడువు పొడిగించాలి
1 min read– ఏఐటీయూసీ, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చంద్రకళ
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య పథకం కొరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించాలని ఏఐటీయూసీ అనుబంధ సంస్థ, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చంద్రకళ సంబంధిత అధికారులను కోరారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ పట్టణ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన 18 సంవత్సరాల లోపు ఉన్న అనాధ పిల్లలకు ప్రభుత్వం అందించే 4 వేల రూపాయలను పిల్లలకు, లేదా వారి సంరక్షకుల ఖాతాలోకి జమ చేసేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 15 కు గడువు ముగుస్తుండడంతో పిల్లల సంరక్షకులుఆందోళన చెందుతున్నారన్నారు. పూర్తిస్థాయి దరఖాస్తును సంబంధిత అధికారులకు అందించుటకు కనీసం ఈనెల ఆఖరు వరకైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని ఆమె తెలిపారు.అర్హులైన అనాధ పిల్లలకు సహాయం అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనివిజ్ఞప్తి చేశారు. ఆధార్ నందు స్కూల్ రికార్డులలో నమోదైన వివరాలు సరి చేసుకొనుటకు అంత సమయం అవసరమని గడువు పొడిగించాలని కోరారు.