PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటర్ల జాబితా లో పొరపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని రండి

1 min read

డిసెంబర్ నెలలో  2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం..

జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు…

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ముసాయిదా ఓటర్ల జాబితా లో ఉన్న పొరపాట్లు ఉంటే  అధికారుల దృష్టికి తేవాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు.బుధవారం ఉదయం తన చాంబర్లో రాజకీయ ప్రతినిధులతో   జిల్లా రెవెన్యూ అధికారి సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇదివరకు ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం రాజకీయ పార్టీ ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల పరిశీలన చేయవలసిందిగా కోరారు. అందులో ఏమైనా తప్పులు , పొరపాట్లు జరిగి ఉన్న సంబంధిత బి ఎల్  ఓ ,ఏ ఈ ఆర్ఓ , ఈ ఆర్వో   ల కి సంబంధిత ఫారంలో  09-12-2023 లో గా విడి విడిగా అందజేయాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని , చనిపోయిన లేదా శాశ్వతంగా వేరే ప్రదేశానికి మారిన వారి ఓట్లు తొలగించడానికి ప్రత్యేక ఫారాలను విడి విడిగా ఇవ్వాలని కోరారు. పై సవరణలన్నీ పూర్తి అయిన తర్వాత ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితా  జారీ  చేయబడుతుందని తెలియజేశారు.ఈ సందర్భంగా  జిల్లా రెవెన్యూ అధికారి రాజకీయ పార్టీలను ఉద్దేశించి పలు సూచనలు చేశారు… పార్టీల తరఫున బూత్ లెవెల్ ఏజెంట్ లను నియమించుకుని ఆ సమాచారాన్ని  జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని , ప్రత్యేక ఓటర్ నమోదు డిసెంబర్ నెలలో 2వ తారీకు మరియు 3వ తారీకు ఉంటుందని కావున వారు ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బిఎల్వోలు , సచివాలయ సిబ్బంది రాజకీయ పార్టీల ప్రతినిధులకు వారు కోరిన సమాచారము ఇవ్వాలని మరియు సహాయ సహకారాలు అందించాలని , ఆ విధంగా సహకరించని వారిని వ్రాత పూర్వకముగా తెలియజేసి నట్లయితే వారి మీద శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.రెండు జిల్లాల సరిహద్దుల్లో ఎవరికైనా రెండు ప్రదేశాలలో ఓటర్లుగా నమోదు అయి ఉంటే వాటిని పంచనామా చేసి సరిచేస్తామని డి.ఆర్.ఓ తెలిపారు.ఈనెల 27- 11- 23 తారీకున సాయంకాలం 4 గంటలకు ఓటర్ల జాబితా పర్యవేక్షకులు మురళీధర్ రెడ్డి  ఐ.ఏ.ఎస్ ( ఎం.డి  ఎ. పి. ఎం. ఎస్. ఐ. డి. సి) గారితో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి సమావేశం రాజకీయ పార్టీలతో మరియు జిల్లా ఎన్నికల అధికారులతో ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశానికి రాజకీయ పార్టీ ప్రతినిధులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ లీగల్ జనరల్ సెక్రెటరీ పుల్లారెడ్డి , తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్.వి. ప్రసాద్ పాల్గొన్నారు , ఆమ్ ఆద్మీ పార్టీ ప్రసిడెంట్ మహమ్మద్ అక్బర్  , భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా జనరల్ సెక్రటరీ కోటీశ్వరుడు,పి.టి.సాయి ప్రసాద్ (రాష్ట్ర ప్రతినిధి) , ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ మురళి పాల్గొన్నారు.

About Author