సీఎంకి ధన్యవాదాలు తెలిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : నేడు ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వైద్య, ఆరోగ్య చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించారని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఏలూరు, విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభించి రాష్ట్రంలో వైద్య విద్యను పొందాలనుకునే విద్యార్థులతో పాటు స్థానిక ప్రజలకు కూడా సీఎం ఎనలేని మేలు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఏలూరు మెడికల్ కాలేజీ ఏర్పాటు వలన అనేక దశాబ్దాలుగా ఉన్న కల తీరిందని, స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో ప్రభుత్వాలు సాధించలేని ఘనత ఇప్పుడు సాకారం అయ్యిందని, ఈ కలను సాకారం చేసినందుకు సీఎం వైయస్ జగన్ కి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. రూ. 60 కోట్ల రూపాయల వ్యయంతో సర్వహంగులతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో వైద్య కళాశాల భవనాన్ని నిర్మించడం జరిగిందని, భవనాన్ని జీ ప్లస్ టు గా అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ లుక్‌తో తీర్చిదిద్దడం జరిగిందని, మూడు అత్యాధునిక ల్యాబ్‌లు హిస్టాలజీ ల్యాబ్, హెమటాలజీ ల్యాబ్, బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లను అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు.ప్రజలు ఇప్పుడు అత్యాధునిక వైద్యం కోసం పట్టణాలకు వెళ్ళి ధన వ్యయ, ప్రయాసలకు లోను కాకుండా ఇక్కడే అన్ని రకాల చికిత్సలు పొందవచ్చని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు.
.