NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం కృషి ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని  ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పష్టం చేశారు. తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో  వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎం  ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన వైఎస్సార్ చేయూత చెక్కు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళలు ఆర్థిక స్థలమున సాధించడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని తెలిపారు. మండలంలో 3,861 మందికి చేయూత నాలుగో విడత కింద మంజూరైన రూ 7.24 కోట్ల  చెక్కును లబ్దిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.మన పత్తికొండ నియోజకవర్గంలో నాలుగు విడతలలో 116 కోట్ల 20 లక్షల రూపాయలను బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ మహిళల జీవనోపాధులు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం చేయూత పథకాన్ని అమలుచేస్తున్నట్లు ఆమె వివరించారు. మన రాష్ట్రంలో  నాలుగు విడుతలలో అమలైన వైయస్సార్ చేయూత ద్వారా ఏటా రూ. 18,750 చొప్పున క్రమం తప్పకుండా సహాయం  అందించిన గొప్ప నాయకుడు మన జగనన్న అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి 26,98,931 లక్షల మంది అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత క్రింద మన ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ. 5060.49 కోట్ల తో కలిపి ఇప్పటివరకు 33,14,916 అక్క చెల్లెమ్మలకు తద్వారా దాదాపు కోటి మంది మహిళలకు మేలు జరిగిందన్నారు.  మన ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే మొత్తం సాయం రూ. 19,189.60 కోట్లు అని తెలిపారు. పేదవారు బాగుపడాలంటే మళ్లీ జగనన్న నే ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లను అభ్యర్థించారు.

About Author