ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్ అరెస్ట్
1 min readపల్లెవెలుగువెబ్ : అవినీతి ఆరోపణలపై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ను శుక్రవారం ఏసీబీ అరెస్టు చేసింది. రెండేళ్ల క్రితం ఆయన ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా పనిచేసినప్పుడు నిబంధనలను ఉల్లంఘించి 32 మందిని అక్రమంగా నియమించారని ఆరోపించింది. వక్ఫ్ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చినట్టు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన నివాసాలు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరిపింది. రెండు పిస్తోళ్లు, తూటాలు, రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.